Medigadda | హైదరాబాద్, ఏప్రిల్18 (నమస్తే తెలంగాణ): ‘మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి ఎత్తు పెంచి నదుల అనుంసధానం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం రెండింటి అవసరాలను తీర్చవచ్చు’ ఇదీ తాజాగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదన. దీనిపై శుక్రవారం ఢిల్లీలో నిర్వహించనున్న నదుల అనుసంధానం ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు 19వ సమావేశం ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం డీపీఆర్‌పై ఇప్పటికే తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు అభ్యంతరాలను తెలిపాయి. దీంతో డీపీఆర్‌లో పలు మార్పులు చేసింది. కొత్త అంశాలను కూడా ఎన్‌డబ్ల్యూడీఏ చేర్చింది. ఆయా అంశాలపై కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు, రివర్ లింకింగ్ ప్రాజెక్టుల టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో కొనసాగనున్న సమావేశంలో చర్చించనున్నారు.
నేటి సమావేశంలో చర్చించే అంశాలు