రవీంద్రభారతి, ఆగస్టు 31 : స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు సాధించిన స్ఫూర్తితోనే చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఎవరైనా వ్యతిరేకిస్తే సహించేదిలేదని, వారికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, పురుషోత్తంగౌడ్, వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్బాగ్లోని దేశోద్దారక భవన్లో జరిగిన బీసీల యుద్ధభేరి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్టుకు ఎవ్వరూ వెళ్లొద్దని, ఎవరైనా వెళ్తే పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేతకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు రాజకీయాలకతీతంగా బీసీలంతా ఐక్యపోరాటాలు చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. దోపిడీ, అన్యాయం, అణిచివేతకు గురైన బీసీలు.. రాజ్యాధికారం సాధించాలని, ఇది సాధ్యం కావాలంటే బీసీలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మాట్లాడుతూ.. ఒక శాతం జనాభా ఉన్నవారు రాష్ర్టాన్ని పరిపాలిస్తున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): న్యాయమైన హకుల సాధనకు, రాజ్యాధికారంలో సముచిత గౌరవం కోసం మున్నూరుకాపులతో పాటు బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ సమీప లీస్బర్గ్లో నిర్వహించతలపెట్టిన మహాసభలో పాల్గొనేందుకు ఆదివా రం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాసభను ఏర్పాటు చేసిన వెంకట్, రజనీకాంత్, వారి మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మహాసభ తెలుగు రాష్ట్రాలకు చెందిన మున్నూరుకాపులు, తె లగ, కా పులు, ఒంటరి, బలిజలను మాత్రమే కాకుండా దేశంలోని బీసీ కులాలన్నింటినీ చైతన్యవంతం చేస్తుందని, ఐక్యత పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.