హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : బెంగళూరు రేవ్‌పార్టీలో 101 మందిని గుర్తించినట్లు బెంగళూరు నగర కమిషనర్ దయానంద వెల్లడించారు. మంగళవారం ఆయన బెంగళూరులో మాట్లాడు తూ.. ఈ నెల 19న జరిగిన రేవ్‌పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసినట్లు తెలిపారు. ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డికి చెందిన ఎమ్మెల్యే పాస్‌తో ఉన్న వాహనం దొరికినప్పటికీ అందులో మంత్రిగాని, అతని సన్నిహితులు గాని లేరని స్పష్టం చేశారు. ఓ నటి పాల్గొన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.