దేశానికే ఆదర్శం రైతు వేదికలు : ఎమ్మెల్యే కొప్పుల
ఎమ్మెల్యే కొప్పుల | రైతువేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు.

వికారాబాద్ : రైతువేదికల నిర్మాణం దేశానికే ఆదర్శమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మంగళవారం పరిగి మండలంలోని రంగాపూర్, రాపోల్, సయ్యద్‌పల్లి, చిగురాల్‌పల్లి గ్రామాలలో నిర్మాణం చేపట్టిన రైతువేదికలను ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పంటలు సాగు చేసేందుకు అవసరమైన పెట్టుబడి సహాయం దగ్గర నుంచి పండించిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు వరకు ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలు ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందాయని అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలో ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా రైతులకు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయం ఎకరాకు రూ.5వేలు అందజేశారని చెప్పారు. రైతులు అప్పులు చేయకుండా పంటల సాగు చేపట్టాలన్నది సర్కారు ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతి రైతు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగిందన్నారు.
రైతువేదికల నిర్మాణం ద్వారా రైతులు ఒక దగ్గర కూర్చొని పంటల సాగు, మార్కెటింగ్ తదితర అంశాలు చర్చించుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జెడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ మేడిద రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
త్వరలో సోమశిల- సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణం
న్యాయవాది వృత్తిలో ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అసంపూర్తి పనులు సత్వరమే పూర్తి చేయాలి
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే గండ్ర
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

