హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి ట్రెయినీ ఐఏఎస్‌లు శుక్రవారం బస్‌భవన్‌ను సందర్శించారు. సంస్థ ఎండీ సజ్జనార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి తమ కార్యక్రమాలను వివరించారు.
ఆర్టీసీ పనితీరు,ఉద్యోగులసంక్షేమం, మహాలక్ష్మిపథకం అమలు, ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ట్రెయినీ ఐఏఎస్‌లు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్-హెచ్ఆర్డీ)లో ప్రాక్టికల్ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్‌తోపాటు ఎంసీఆర్హెచ్ఆర్డీ సీడీఎస్ సెంటర్ హెడ్ డాక్టర్ కందుకూరి ఉషారాణి, నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.