హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఏపీకి పంపాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో శివశంకర్‌ను రిలీవ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, తెలంగాణలో శివశంకర్ గడువు జూలైకి ముందే ముగిసింది.
అయినా ఇక్కడే కొనసాగడంతో ఆయనను ఏపీకి పంపాలని జూలై 3న క్యాట్‌కు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర హైకోర్టు.. అందుకు 4 వారాల సమయం ఇచ్చింది. తాజాగా ఆ గడువు ముగియడంతో శివశంకర్‌ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.