హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఫార్ములా-ఈ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ ముగిసింది. ఏ2గా ఉన్న ఆయనను ఏసీబీ అధికారులు సుమారు 6 గంటలపాటు విచారించారు. మాజీ మంత్రి కేటీఆర్, బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ అధికారులు విచారించినట్టు తెలిసింది.
హెచ్ఎండీఏ ఖాతా నుంచి ఎఫ్ఈసీ కంపెనీ అకౌంట్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు విషయంలో ఆరా తీసినట్టు సమాచారం. అరవింద్‌కుమార్ స్టేట్మెంట్ను రికార్డు చేసిన అధికారులు.. తిరిగి ఆయనను పంపించేశారు.