చౌటుప్పల్, జనవరి 24: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆదర్శ వివాహం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం లింగారెడ్డి గూడెంకు చెందిన సుర్కంటి కవిత, సుధాకర్‌రెడ్డి దంపతుల కూతురు ఐపీఎస్ సుర్కంటి శేషాద్రినీరెడ్డి హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నది. వీరి కుటుంబం కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నది.
శేషాద్రినిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఐఏఎస్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి ఆర్భాటాలు లేకుండా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య ఎలాంటి ఆర్భాటం లేకుండా వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి వచ్చిన అధికారులు నూతన జంటను అభినందించారు. నేటి తరం వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సాధించిన వీరు తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.