యాదాద్రి, సెప్టెంబర్ 17 : కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆయన సోదరుడు రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోగా, తమ్ముడికి సహకరించాలంటూ సొంత పార్టీ నేతలకు వెంకట్రెడ్డి వాట్సాప్ కాల్స్ చేస్తూ కోవర్టు రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యాదగిరిగుట్టలో మీడియాతో మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పుకొచ్చారు. ‘మును గోడు ఉప ఎన్నిక జోలికి వెళ్లను. రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తా’నని వెల్లడించారు. దాంతో పక్కనే ఉన్న కాంగ్రెస్ నాయకులు అవాక్కయ్యారు.