ఊపిరున్నంత వరకు టీఆర్ఎస్లోనే

- పార్టీ మారుతాననే ప్రచారాన్ని నమ్మొద్దు
- నా రాజకీయ ఎదుగుదలకు కేసీఆరే కారణం
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఊపిరి ఉన్నంతవరకు తాను టీఆర్ఎస్లోనే ఉంటానని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. తనపై గిట్టనివారు చేసే ప్రచారం నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను షర్మిల భర్త బ్రదర్ అని కుమార్‌తో కలిసి ఉన్న పాత ఫొటోను సోషల్‌మీడియాలో వైరల్ చేసి పార్టీ మారుతున్నానని అసత్య ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్ కుటుంబంతో తనకు వ్యక్తిగత పరిచయం ఉన్నదని, కానీ తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకొన్నప్పుడే ఆయనతో విభేదించానని గుర్తుచేశారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు రాజకీయంగా అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ ఎదుగుదలకు అవకా శం ఇచ్చారని చెప్పారు. టీఆర్ఎస్లో తాను సంతృప్తిగా ఉన్నానని ప్రకటించారు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా తనకు ఇష్టమైన వైద్యారోగ్యశాఖ మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. తా నెప్పుడూ సీఎం కేసీఆర్‌కు, పార్టీకి విధేయుడిగానే ఉంటానని స్పష్టంచేశారు. దళితజాతి ఉద్ధ్దరణ కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఊరూరా తిరిగి ప్రచారం చేస్తానని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

