హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2022- 23 ఐ-సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబ్రాది, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి రమేశ్ బుధవారం విడుదల చేశారు. మొత్తం 14 రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు లింబ్రాది తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి జూన్ 27 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రూ.1000 అపరాధ రుసుముతో జూలై 23 వరకు దరఖాస్తులు
స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. జూలై 27, 28 రెండు రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తామని, పరీక్ష ఫలితాలను ఆగస్ట్ 22న విడుదల చేయనున్నట్లు వివరించారు.