అమీన్పూర్ , నవంబర్ 1 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా అధికారులు ఆదివారం ఐదు అంతస్థుల భవనాన్ని నేటమట్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. 2022లో పీజేఆర్ కాలనీ వద్ద అమీన్పూర్ -శేరిలింగంపల్లి సరిహద్దు ప్రాంతమైన సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి చొరబడి 126 డీ, 126సీ ప్లాట్లు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి స్థలంగా సృష్టించారు.
ఐదు అంతస్థులకు అనుమతి కోసం మున్సిపల్‌ను ఆశ్రయించారు. అప్పటి కమిషనర్ సుజాత, టీపీఓ సంజన నిర్మాణానికి అనుమతులిచ్చారు. భాను కన్స్ట్రక్షన్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ 473 గజాల ప్రభుత్వ స్థలాన్ని కలుపుకొని 873 గజాల్లో ఐదు అంతస్థుల భవనం నిర్మించారు. ఫేక్ ఎల్ఆర్ఎస్తో అనుమతి తీసుకున్నట్టు గ్రహించిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నరేశ్ కేసు నమోదు చేశారు. హైడ్రా రంగంలోకి దిగి భవనాన్ని కూల్చింది.