హైదరాబాద్ : హైడ్రా(HYDRAA) కూల్చివేతలు పేదోళ్ల పొట్ట గొడుతున్నవి. తిండి తిప్పలు మాని, ఆరు గాలం శ్రమించి పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు కండ్ల ముందే నేలటమట్టం అవుతుంటే పేదోళ్ల కన్నీళ్లు వరదలై పారుతున్నాయి. సమయం.. సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురుచేస్తున్నాయి. తాజాగా ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలతో కూకట్పల్లి(Kukatpally), అమీన్పూర్ ప్రాంతాలన్నీ గరీబోడి ఆవేదన.. రోదనలతో ప్రతిధ్వనించాయి.
ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి?(CM Revanth reddy) మీరు వస్తే బాగుంటుందని నేను కూడా మీకు ఓటేసిన. కానీ, ఇట్లా చేస్తావనుకోలే. సామాన్లు తీసుకునేందుకు మాకు కొంత టైం ఇవ్వండి. మా కోడలు ఐదు నెలల గర్భవతి ఉన్నఫళంగా వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలని ఓ మహిళ బోరున విలపిస్తూ ప్రభుత్వాన్ని వేడుకున్నదృశ్యం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. నిరాహార దీక్ష చేసి కేసీఆర్ నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తే.. అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి పేదలను పీడిస్తున్నారంటూ.. బాధితులు గగ్గోలు పెట్టారు. తమ బతుకులు రోడ్డుపై పడుతున్నా.. ముఖ్యమంత్రి కనికరించడం లేదని కన్నీరుపెట్టుకున్నారు.
ఇంత అన్యాయమా రేవంత్ రెడ్డి?
మీరు వస్తే బాగుంటుంది నేను కూడా మీకు ఓటేసిన
కానీ ఇట్లా చేస్తావ్ అనుకోలే..
మా సామాన్లు తీసుకునే వరకు సమయం ఇవ్వండి అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న హైడ్రా బాధిత మహిళ. https://t.co/NemYHeYUlD pic.twitter.com/6E4zTfipG8
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2024