Sunnam cheruvu | కూల్చిన ఇండ్లకూ కరెంట్ బిల్లులు..! సున్నంచెరువులో హైడ్రా కూల్చేసిన ఇండ్లకు ఆస్తి, నల్లా, విద్యుత్తు బిల్లులు
నిలువనీడ లేకుండా హైడ్రా సృష్టించిన విధ్వంసం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం బాధితులను వదలడం లేదు. రెండేండ్ల క్రితం సున్నంచెరువు ప్రాంతంలో కూల్చేసిన ఇండ్లకు కూడా కరెంటు, ఆస్తి పన్ను, నల్లా పన్నుల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నది. సున్నంచెరువు బఫర్, ఎఫ్టీఎల్లో కట్టారంటూ మాదాపూర్లోని గుట్టల బేగంపేటకు చెందిన సర్వే నంబర్లు 12,13లో 2024 సెప్టెంబర్లో హైడ్రా వీరి ఇండ్లు, షెడ్లు కూల్చివేసింది. కానీ వారికి ఇల్లు లేకున్నా ఆస్తి పన్ను, ప్లాట్ వద్ద మీటర్ లేకపోయినా కరెంట్ బిల్లులు, నల్లా పన్నులు ఇస్తూ మున్సిపల్ సిబ్బంది ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
- సున్నంచెరువులో హైడ్రా కూల్చేసిన ఇండ్లకు ఆస్తి, నల్లా, విద్యుత్తు బిల్లులు
- రెండేండ్లుగా వసూళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 26 (నమస్తే తెలంగాణ) : నిలువనీడ లేకుండా హైడ్రా సృష్టించిన విధ్వంసం ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నా.. ప్రభుత్వం మాత్రం బాధితులను వదలడం లేదు. రెండేండ్ల క్రితం సున్నంచెరువు ప్రాంతంలో కూల్చేసిన ఇండ్లకు కూడా కరెంటు, ఆస్తి పన్ను, నల్లా పన్నుల పేరుతో నిలువుదోపిడీ చేస్తున్నది. సున్నంచెరువు బఫర్, ఎఫ్టీఎల్లో కట్టారంటూ మాదాపూర్లోని గుట్టల బేగంపేటకు చెందిన సర్వే నంబర్లు 12,13లో 2024 సెప్టెంబర్లో హైడ్రా వీరి ఇండ్లు, షెడ్లు కూల్చివేసింది. కానీ వారికి ఇల్లు లేకున్నా ఆస్తి పన్ను, ప్లాట్ వద్ద మీటర్ లేకపోయినా కరెంట్ బిల్లులు, నల్లా పన్నులు ఇస్తూ మున్సిపల్ సిబ్బంది ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
కూల్చివేతల సమయంలో అక్కడ ఉన్న కరెంట్ మీటర్లు తీసుకెళ్లిన విద్యుత్ సిబ్బంది ఈ మీటర్లకు బిల్లులెందుకు వేస్తున్నారనే విషయాన్ని మాత్రం బాధితులకు చెప్పడం లేదు. హైడ్రా కూల్చివేసినప్పటి నుంచి నేటివరకు హైకోర్టులో దీనిపై ప్లాట్ల యజమానులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్లాట్లలో హైడ్రా ఎలాంటి పనులు చేయవద్దంటూ కోర్టు స్టే విధించింది. కానీ హైడ్రా మాత్రం వీరి ప్లాట్లలో సున్నంచెరువు పనులు పూర్తిచేస్తూ తాము కేవలం చెరువులోనే పనిచేస్తున్నామని హైకోర్టుకు చెప్పినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు ఇండ్లు పోయి మరోవైపు తాము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు చెరువుపాలై ఇంకోవైపు లేని ఇండ్ల, మీటర్లకు బిల్లులు కట్టుకుంటూ తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

