AV Ranganath | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘హైదరాబాద్ మధురానగర్‌లో ఉన్న మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి రాదు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం జరిగింది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నట్టుగా బయట జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని, దాని కి సంబంధించిన మ్యాప్‌లు, ఫొటోలను విడుదల చేశారు. తమ తండ్రి ఏపీవీ సు బ్బయ్య 1980లోనే ఈ ఇంటిని నిర్మించారని, తాము 44 ఏండ్లుగా అదే ఇంటి లో నివాసం ఉంటున్నామని తెలిపారు. 25 ఏండ్ల క్రితమే కృష్ణకాంత్ పార్క్ ఏ ర్పాటైందని గుర్తుచేశారు. నిబంధనల ప్రకారం.. చెరువు కట్ట ఎత్తుపై ఆధారపడి దిగువన 5-10 మీటర్ల దూరంలో బఫర్ జోన్ ఉంటుందని, తమ ఇల్లు చె రువు కట్టకు కిలోమీటర్ దూరంలో ఉన్నదని పేర్కొన్నారు. కృష్ణకాంత్ పార్క్ స్థలంలో 25ఏండ్ల క్రితం ఒక చెరువు ఉండేదని, తాము ఉంటున్న నివాసం దానికీ దూరంగానే ఉన్నదని తెలిపారు. తమ ఇల్లు బఫర్ జోన్ పరిధిలో లేదన్న వాస్తవాన్ని గ్రహించాలని కోరారు.
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 24(నమస్తే తెలంగాణ) : ఖమ్మం డీసీసీ బీ, రెండు పెద్ద బ్యాంకులు, ఓ గ్రామీణ బ్యాంకును కేటుగాళ్లు బురిడీ కొట్టించినట్టు తెలుస్తున్నది. నకిలీ బంగారం తా కట్టు పెట్టి పెద్దఎత్తున రుణాలు పొందినట్టు నగరంలో ప్రచారం జరుగుతున్నది. మూడు నెలల నుంచి మోసగాళ్లు పక్కా ప్లాన్‌తో బ్యాంకుల అధికారులను నమ్మించి రుణాలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. మోసపోయిన సంగతిని డీసీసీబీ బయటపెట్టింది. మిగిలిన రెండు పెద్ద బ్యాంకులు, ఓ గ్రామీణ బ్యాంకు అధికారులు మాత్రం అధికారికంగా చె ప్పకపోయినప్పటికీ నగరంలో ఆ నో టా ఈ నోటా ఇదే చర్చ నడుస్తున్నది.