ఖైరతాబాద్, జనవరి 29: అమెరికాలోని చికాగోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. ఖైరతాబాద్‌లోని ఎంఎస్ మక్తాకు చెందిన మహ్మద్ ఏజాజ్, షమీమ్ బేగం దంపతుల కుమారుడు మహ్మద్ వాజిద్ చికాగోలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడే ఉంటున్నాడు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్ఆర్ఐ విభాగంలో కొనసాగుతున్నాడు. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వాజిద్ మృతి చెందడంతో ఎంఎస్ మక్తాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, తెలంగాణ మైనారిటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, మాజీ కార్పొరేటర్ ఎస్కె షరీఫ్‌తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు.