చంపాపేట, మే 9: అమెరికాలోని ఫ్లోరిడా స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ మృతిచెందింది. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని న్యూ శివపురి కాలనీకి చెందిన దేవేందర్‌రెడ్డి, సునీతల కూతురు శ్రీవీణ(28). అమెరికాలోని వర్జ్జీనియా రాష్ట్రంలో భర్తతో కలిసి ఉంటున్నారు.
రెండు రోజుల క్రితం ఫ్లోరిడాలోని ఫంక్షన్‌కు వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌ఫూల్ దగ్గర చోటుచేసుకున్న ప్రమాదంలో చనిపోయారు. విషయం తెలియడంతో హైదరాబాద్‌లోని వారి ఇంటి వద్ద తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మృతురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. వీణ భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకువచ్చేందుకు తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.