హైదరాబాద్, సెప్టెంబర్ 16: హైదరాబాదీ యువకుడొకరు కెనడాలో ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించాడు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేటకు చెందిన ప్రణీత్ ఇటీవల కెనడా యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. శనివారం తన సోదరుడి పుట్టిన రోజు సందర్భంగా సోదరుడు, స్నేహితులతో కలిసి టొరంటో లేక్‌కు వెళ్లాడు. అయితే బోటింగ్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించాడు. అతని మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రవీణ్ స్నేహితుడు సోమవారం సమాచారం అందించాడు. కాగా, ఆస్ట్రేలియాలోని క్వీన్ల్యాండ్స్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో కూడా ఇద్దరు తెలుగు విద్యార్థులు ఇలాగే నీటిలో పడి మరణించారు.