త్బుల్లాపూర్, జూన్ 12: హైదరాబాద్ కొంపల్లిలోని లక్ష్మి హోల్‌సేల్ కిరాణాషాపులో భారీ చోరీ జరిగింది. బుధవారం రాత్రి దుకాణం మూసివేసే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంత కులు గన్‌తో బెదిరించి, డబ్బుల బ్యాగు లాక్కుని వెళ్లారు. హఠాత్ప రిణామంతో ఉలిక్కిపడ్డ దుకాణం యజమాని, పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలోనూ ఇదే దుకాణంలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు.
అప్పుడు రూ.10లక్షల విలువైన వివిధ సామగ్రి, సిగరెట్ డబ్బాలు, డీసీఎం వాహనం ఎత్తుకెళ్లారు. ఇప్పుడు మళ్లీ ఇదే దుకాణాన్ని దుండగులు లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొంపల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న లక్ష్మీ కిరాణా, జనరల్ స్టోర్‌ను మోటూరి సాయిబాబా, రజిత దంపతులు నిర్వహిస్తున్నారు.
బుధవారం రాత్రి రూ.5లక్షల నగదు, సెల్‌ఫోన్‌ను బ్యాగులో పెట్టుకుని సమీపంలోని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. స్కూటీపై వచ్చిన ఇద్దరు ఆగంతకులలో ఒక్కడు షాపు యజమాని సాయిబాబా వద్దకు వెళ్లి గన్ చూపిస్తూ బెదిరించి, బ్యాగును లాక్కొని వెళ్లాడు. షాపులో పనిచేసే పర్వేజ్ అనే యువకుడు దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసును దర్యాప్తు చేస్తున్నారు. కొంపల్లి ప్రాంతంలో ఇటీవల వరుస దొంగతనాలు, నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు భయాందో ళనకు గురవుతున్నారు. ఇదే కిరాణాషాపు సమీపంలో ఇటీవల ఓ హత్య కూడా జరిగిందని చెప్తున్నారు. చీకటి పడితే బయటకు వెళ్లాలంటేనే భయమేస్తున్నదని, పోలీసుల నిఘా, పహారా పెంచాలని కోరుతున్నారు.