హైదరాబాద్ మెట్రోరైళ్ల సమయాన్ని పొడిగించారు. గణేశ్ నిమజ్జనం సందర్బంగా శుక్రవారం ప్రత్యేక సేవలను అందించనుంది. ఉదయం 6 గంటలనుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రోరైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు మెట్రో ఎండీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘గణేశ్ నిమజ్జనం సందర్భంగా మెట్రోరైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నాం. శుక్రవారం రోజు చివరి మెట్రోరైలు సెప్టెంబర్ 10న ఒంటిగంటకు బయలుదేరి, 2 గంటల సమయంలో సంబంధిత స్టేషన్లకు చేరుకుంటుంది. మరుసటిరోజు ఉదయం నుంచి మెట్రో రైళ్లు యధావిధిగా నడుస్తాయి. ప్రయాణికులు మెట్రో సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని మెట్రో ఎండీ ట్విటర్లో పేర్కొన్నారు.