హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఫ్యూచర్ సిటీ, శామీర్పేట, మేడ్చల్ మెట్రో రైలు మార్గాలకు సంబంధించిన డీపీఆర్లను మార్చి నెలాఖరులోగా రూపొందించాలని సీ ఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశిం చారు. వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమో దిస్తే ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిల వాలని స్పష్టం చేశారు. మెట్రో విస్తర ణ, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడా ర్ల నిర్మాణంపై మంగళవారం ఆయన తన నివాసంలో సమీక్ష నిర్వహిం చారు.
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాల ని ఆదేశించారు. శామీర్పేట, మేడ్చల్ మెట్రోలు ఒకే చోట ప్రారంభమయ్యే లా చూసుకోవాలని, ఆయా ప్రాంతా ల్లో భారీ జంక్షన్ల ఏర్పాటుకు ప్రణాళిక తయారు చేయాలని తెలిపారు. హెచ్జీ సీఎల్ కింద రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.