రాష్ట్రంపై ద్రోణి ప్రభావం
నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోని మిగిలిన ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్ పరిసరాలపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతున్నదని వెల్లడించింది. దీంతో వచ్చే రెండురోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది.
ముఖ్యంగా కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసినట్టు వెల్లడించింది. ఆదిలాబాద్ కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నదని వివరించింది. కాగా, గడిచిన 24గంటల్లో నిర్మల్, నల్లగొండ, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

