హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఈదురు గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో నిర్మల్ జిల్లా బాసరలో అత్యధికంగా 4.08 సెం.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు.