Revanth Reddy | 48 గంటల్లో క్షమాపణ చెప్పు.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు
Revanth Reddy | ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన నిరాధారణ ఆరోపణలను హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్‌గా తీసుకొన్నది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు జారీచేసింది.
Revanth Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 26 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన నిరాధారణ ఆరోపణలను హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్‌గా తీసుకొన్నది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు జారీచేసింది. నోటీసు అందుకొన్న 48 గంటల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. లోక్‌సభ సభ్యుడిగా, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఏది మాట్లాడినా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుందని, అందువల్ల చేసే ప్రతి ప్రకటన, చెప్పే మాట బాధ్యతాయుతంగా ఉండాలని సూచించింది.
నిబంధనల ప్రకారమే లీజు
కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చామని హెచ్ఎండీఏ స్పష్టంచేసింది. గత ఏడాది నవంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం టీవోటీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు చేపట్టిన ఈ టెండర్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు. అత్యధిక బిడ్ దాఖలు చేసిన ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్‌కు లీజు ఖరారు చేస్తూ గత నెల 27న లెటర్ ఆఫ్ అవార్డు జారీచేశామని వివరించారు. టెండర్ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఐఆర్బీ ఇన్ఫ్రాకు జారీ చేసిన డాక్యుమెంట్లు, ఇతర వివరాలన్నీ ఆన్లైన్లో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో అన్ని వి వరాలు ఉన్నప్పటికీ బాధ్యతాయుత పదవి లో ఉండి కుట్రపూరితంగా ఓఆర్ఆర్ లీజుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హెచ్ఎండీఏ నోటీసుల్లో రేవంత్‌పై మండిపడింది.
నోటీసులోని అంశాలు..
- ఓఆర్ఆర్ లీజు అంశంలో నిజానిజాలను పట్టించుకోకుండా నిరాధార ఆరోపణలు చేస్తూ హెచ్ఎండీఏ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రకటనలు చేస్తున్నారు. హెచ్ఎండీఏకు, ఐఆర్బీ ఇన్ఫ్రాకు మధ్య కుదిరిన ఒప్పందంపై వాస్తవాలను ధ్రువీకరించుకోకుండా అస్పష్టమైన, నిర్లక్ష్యపు ప్రకటనలు చేశారు. ఆ ఆరోపణలన్నింటికీ ఎలాంటి ప్రాథమిక ధ్రువీకరణ కూడా లేదని అర్థమవుతున్నది.
- ముఖ్యంగా ఈ నెల 24న నిర్వహించిన ప్రెస్మీట్లో హెచ్ఎండీఏ-ఐఆర్బీ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ నిర్ణీత సమయంలో 10 శాతం డిపాజిట్ చెల్లించాలని, అలాంటి చెల్లింపులు చేయకుండా, హెచ్ఎండీఏ నుంచి గడువు కోరిందని ప్రకటించారు. టెండరు నిబంధనల్లో ఎక్కడా ఇది లేదు.
- లీజు పొందిన సంస్థ అంగీకార పత్రం పొందిన 120 రోజుల్లో లీజు మొత్తాన్ని చెల్లించాలనే నిబంధన మాత్రమే ఉన్నది. ఈ వాస్తవం తెలుసుకోకుండా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపాలనే దురాలోచనతో మాట్లాడారు. సొంత ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని రాజకీయంగా సంచలనం చేసేందుకు తప్పుడు కథనాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. బాధ్యతను మరిచి వ్యవహరించారు.
- ఐఆర్బీ సంస్థ చెల్లింపు కోసం సమయాన్ని పొడిగించాలని కోరిందని, హెచ్ఎండీఏ పొడిగించేందుకు ఆసక్తిగా ఉన్నదని మీడియా సమావేశంలో చెప్పారు. వాస్తవానికి అడ్వాన్సు చెల్లింపు ఒప్పందమే లేకపోవడం ఒకవంతైతే.. ఐఆర్బీ పొడిగింపు సమయం కోరడమనేది పచ్చి అబద్ధం. రాజకీయ మైలేజీ పొందాలనే ఏకైక ఉద్దేశంతో ఇలాంటి ప్రకటన చేసినట్టు అర్థమవుతున్నది.
- నిరాధారణ ఆరోపణలు చేసినందున నోటీసు అందుకున్న 48 గంటల్లో బేషరతుగా హెచ్ఎండీఏకు క్షమాపణ చెప్పాలి.
- ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు ఉపసంహరించుకొని, క్షమాపణలు చెబుతున్నట్టుగా ప్రకటన చేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకొంటాం.
బ్లాక్మెయిల్ రేవంత్ బుద్ధి తెలియందెవరికి?
- సరారుకు క్షమాపణలు చెప్పాలి.. రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగా ణ): ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టుపై అవాస్తవాలను ప్రచారం చే యడంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీజే పీ వాట్సాప్ యూనివర్సిటీని మించిపోయారని తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంట్రాక్టు సంస్థ అదనపు గడువు అడిగిందన్న రేవంత్ ఆరోపణల్లో నిజం లేదని హెచ్ఎండీఏ క్లారిటీ ఇచ్చిందని, హెచ్ఎండీఏ పంపిన లీగల్ నోటీసుకు సమాధానం చెప్పాలని రేవంత్‌ను డిమాండ్ చేశారు. ఇదే ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంట్రాక్టులు చేస్తున్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు.
బీజేపీ పాలిత గుజరాత్, కర్ణాటకలోనూ ఐఆర్బీ ఇన్ఫ్రా కాం ట్రాక్టులు చేస్తున్నదని వివరించారు. కాం ట్రాక్టు కంపెనీని బ్లాక్ మెయిల్ చేసేందుకే రేవంత్ ఇదంతా చేస్తున్నారా? లేకపోతే ఇప్పటికే డబ్బులు డిమాండ్ చేసి, ఇవ్వకపోతే ఆరోపణలు చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని అన్నా రు. సమాచార హక్కు చట్టాన్ని ఆదా య మార్గంగా మార్చుకున్న రేవంత్ బుద్ధి రాష్ట్రంలో ప్రతి ఒకరికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వానికి, హెచ్ఎండీఏకు రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

