Hyderabad | ఐటీ రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్.. తొమ్మిదేండ్లలో అద్భుత ప్రగతి
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో హైదరాబాద్ నగరం అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఐటీ రంగం ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకెళ్తున్నది.
- తొమ్మిదేండ్లలో అద్భుత ప్రగతి
- ఎగుమతులు నాలుగింతలు
- ఉద్యోగాలు మూడింతలు
- వెన్నుదన్నుగా ప్రభుత్వ విధానాలు
- పెట్టుబడులతో వస్తున్న దిగ్గజాలు
- ప్రపంచం చూపు హైదరాబాద్ వైపే
Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో హైదరాబాద్ నగరం అత్యం త వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక నిర్ణయాలతో ఐటీ రంగం ఆకాశమే హద్దు అన్నట్టుగా దూసుకెళ్తున్నది. హైదరాబాద్ నగరం దాదాపు 1,500 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు కేంద్రంగా మారిందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతుల విలువ రూ.57,258 కోట్లు ఉంటే, 2022-23 నాటికి రూ.2,41,275 కోట్లకు చేరిందని వివరించింది. గత సంవత్సరంతో పోల్చితే ఎగుమతులలో 31.44 % వృద్ధి సాధించినట్టు వెల్లడించింది. ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.60 లక్షల నుంచి 9,05,715 మందికి చేరిందని పేర్కొన్నది.
సమర్థ నాయకత్వంతోనే ఐటీ వెలుగులు
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత, సమర్థ నాయకత్వానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు ఐటీ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. దీంతో భారతదేశపు ఐటీ రంగం స్థూల అభివృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధిరేటు ప్రతి ఏటా అధికంగానే ఉంటుంన్నది. భారతదేశ సిలికాన్‌వ్యాలీగా, ఐటీ క్యాపిటల్‌గా ప్రసిద్ధిగాంచిన బెంగళూరును అధిగమించే దిశగా తెలంగాణ ఐటీ రంగం దూసుకెళ్తున్నది. యాపిల్, అమెజాన్, సేల్స్‌ఫోర్స్, ఉబర్, మైక్రాన్, స్టేట్‌స్ట్రీట్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, ఫియట్క్రిస్లర్, మాస్‌మ్యూచువల్, ఇంటెల్, ప్రొవిడెన్స్, గోల్డ్మ్యాన్సాచ్స్, జెడ్ఎఫ్, యూబీఎస్, పెప్సి వంటి కంపెనీలను ఆకర్షించడంతోపాటు ఫేస్బుక్, క్వాలామ్, అక్సెంచర్, వేల్స్ఫార్గో, క్సిలినిక్స్, మైక్రోసోఫ్ట్, ఇన్ఫోసిస్, ఒరాకిల్, టీసీఎస్, ఐబీఎం, టెక్‌మహీంద్ర, కాగ్నిజెంట్, విప్రో తమ కార్యకలాపాలను విస్తరించాయి. ఐటీ రంగ విస్తరణ మిగతా రంగాలైన నిర్మాణ, రవాణా, వినోద రంగాలపై సైతం ప్రభావం చూపింది. టైర్-2 నగరాల్లో సైతం ఐటీ టవర్లను నిర్మిస్తూ స్థానిక యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీ శాఖ చర్యలు చేపట్టింది.
స్టార్టప్ క్యాపిటల్‌గా తెలంగాణ
స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నెలకొల్పిన టీహబ్-1, టీహబ్-2 సాంకేతికరంగ అభివృద్ధిలో సృష్టిస్తున్న అద్భుతాలు ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ‘ఆలోచనలతో రండి.. ఆవిషరణలతో వెళ్లండి’ అనే నినాదం తో 2015 నవంబర్ 5న గచ్చిబౌలిలోని ట్రిపు ల్ ఐటీ క్యాంపస్‌లో టీహబ్ ప్రారంభమైంది. ఇది దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గానే కాకుండా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా నిలిచింది. దీనికి మం చి స్పందన రావడంతో తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్లతో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీహబ్-2ను ప్రపంచలోనే అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్‌గా భారీస్థాయిలో నిర్మించింది. తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ ప్రాజెక్ట్ (ఫైబర్‌గ్రిడ్ పథకం)ను చేపట్టింది. మొ దటి దశలో భాగంగా 33 జిల్లాలు, 12,769 గ్రామపంచాయతీలు, 142 పట్టణ స్థానిక సంస్థలు, 30,000 ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ సదుపాయాలను కల్పిస్తున్నది. మరో 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఇంటర్నెట్ కల్పించే దిశగా చర్యలు చేపట్టింది.
హార్డ్‌వేర్ రంగంలో ఆవిష్కరణలకు టీ-వర్స్
సాఫ్ట్వేర్ రంగంలో ఆవిష్కరణలకు కేం ద్రంగా ఉన్న టీహబ్ తరహాలోనే హార్డ్‌వేర్ రంగంలో సైతం నూతన ఆవిషరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్‌ను టీ-వర్క్స్ పేరుతో ఏర్పాటుచేసింది. పైసా ఖర్చు లేకుండా ఆవిషర్తలు తమ సరికొత్త ఆలోచనల మేరకు ఉత్పత్తులను ఆవిషరించుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, విద్యుత్తు వాహన(ఈవీ) రంగాల విస్తరణకు అవసరమయ్యే అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నారు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ కంపెనీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్ రంగంలోనూ హబ్‌గా మారుతున్నది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలైన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, బ్లాక్‌చైన్, క్లౌడ్, డ్రోన్స్, ఐవోటీ, రోబోటిక్స్, స్పేస్టెక్నాలజీపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి పలు ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో కలిసి చేపడుతున్నది.
తెలంగాణ ఐటీ ప్రగతి ప్రస్థానం
- ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ రూ.20,761 కోట్లతో ఫాబ్సిటీ, ఫార్మాసిటీ, చందనవెల్లిలో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది.
- నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ.500 కోట్లతో స్మార్ట్ డాటా సెంటర్‌ను నెలకొల్పింది.
- సేల్స్‌ఫోర్స్ సంస్థ రూ.1,119 కోట్లతో విస్తరణ చేపట్టింది.
- గోల్డ్‌మాన్ శాచ్స్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు ద్వారా 2,500 మందికి ఉద్యోగాలు లభించాయి. – అమెరికన్ బీమారంగ కంపెనీ మసాచూసెట్ మ్యూచువల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ రూ.1,000 కోట్లతో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఇలా ఒక్కొ క్క కంపెనీ రాకతో ప్రముఖ కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. కార్పొరేట్ రంగంలోనే ప్రముఖ కంపెనీలు తమ అతి పెద్ద, రెండో అతి పెద్ద క్యాంపస్‌లను ఇప్పటికే ఏర్పాటు చేశాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
Health tips | మీకు డయాబెటిస్ ఉందా.. అయితే బొబ్బర్లతో ఎన్ని లాభాలో తెలుసా..?
Cult | విశ్వక్ సేన్‌కు ‘కల్ట్’ డబుల్ షాక్.. ‘లైలా’ కంటే తక్కువ వసూళ్లు, ఇకపై సినిమాల ఎంపికే కీలకం!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

