హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ 4.0 అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన రీఇమేజినింగ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా నగరాభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలను కొనసాగించారని చెప్పారు. 1965లో ఆనాటి పాలకులు తీసుకున్న నిర్ణయాల ఫలితాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని వివరించారు.
సిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రాంతం బ్యాగరి కంచె పేరు పలకడానికి ఇబ్బందిగా ఉన్నా.. నాలుగైదేండ్లలో గొప్పగా చెప్పుకునే స్థాయికి అభివృద్ధి చేస్తామని చెప్పారు. మూసీ రివర్ డెవలప్మెంట్తో పెట్టుబడులంటే హైదరాబాద్ గుర్తొచ్చేలా చేస్తామని, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లతో నగారాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏడాదిలోగా మాస్టర్ ప్లాన్ 2050 అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.