హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తేతెలంగాణ) : కేసీఆర్ హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఫార్మా రంగానికి అంతర్జాతీయ కేంద్రంగా అవతరించిందని వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు.
బుధవారం శంషాబాద్ సమీపంలోని నోవాటెల్లో ‘కోల్డ్ చెయిన్ అన్ బ్రోకెన్-2026’ రెండు రోజుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఫార్మాను విస్తరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 33వేల ఎకరాలను సేకరిస్తే, నేటి ప్రభుత్వం దానిని ‘ఫ్యూచర్ సిటీ’ పేరిట ప్రచారం చేసుకుంటున్నదని ఎద్దేవా చేశారు.