హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన క్రిసెంట్ హస్తకళా కళాకారుల సంక్షేమ సంఘానికి భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్జీఐ) సర్టిఫికెట్ అందజేశారు. గురువారం సచివాలయంలో ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయేశ్ రంజన్ సమక్షంలో సంఘం అధ్యక్షుడు హిసాబుద్దీన్కు జీఐ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆ ధ్వర్యంలో జియోగ్రాఫికల్ రిజిస్ట్రీ విభాగం ఇ టీవలే హైదరాబాద్ లాడ్‌బజార్‌లోని లక్క గా జులకు జీఐ గుర్తింపును ప్రకటించింది. ఇకమీదట లాడ్‌బజార్ లక్క గాజులు జీఐ బ్రాండింగ్‌తో విక్రయించేందుకు వీలు కలుగుతుంది. ఫలితంగా వీటికి ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం లభించే అవకాశం ఉన్నది.