మాకు ఓ తండ్రి లాగా దళిత బంధు ఇస్తున్నందుకు కేసీఆర్ సార్ను ఎల్లప్పుడూ దేవునిలా కోలుచుకుంటాం. మనస్ఫూర్తిగా కేసీఆర్ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాం. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. – కల్లెపల్లి శంకర్, మామిళ్లవాడ
కేసీఆర్ సార్ నా బిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి కింద లక్ష రూపాయాలు సాయం చేసిండు. రైతు బంధు ఇచ్చిండు. అతి త్వరలో రుణ మాఫీ కూడా అయితది. అందుకే కేసీఆర్ సార్కు సపోర్ట్ చేస్తున్నాం. – పెండ్యాల రాజేశ్వర్ రెడ్డి, తుమ్మలపల్లి గ్రామం