BRS Party | హైదరాబాద్ : హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు. మాజీ సర్పంచులు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో తనుగుల మాజీ సర్పంచ్ రామస్వామి, శంభునిపల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, పాపక్కపల్లి మాజీ సర్పంచ్ మహేందర్, శాయంపేట మాజీ సర్పంచ్ భద్రయ్య, నాగంపేట మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, రాచపల్లి సదానందం, జైద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.