Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ శాతం రికార్డు దిశగా పెరుగుతోంది. గంట గంటకూ పోలింగ్ శాతం పెరుగుతుండటడం, ఇప్పటికీ ఓటర్లు క్యూలో నిల్చుండటంతో దాదాపు 90 శాతం వరకూ పోలింగ్ అవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు 76.26శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు మీడియాకు తెలిపారు. సాయంత్రం 7 గంటల వరకూ ఓట్లు వేసేందుకు అవకాశం ఉంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్న అందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.