Huzurabad | హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికలో రోటీమేకర్ గుర్తు టీఆర్ఎస్ ఓట్లను చీల్చివేసింది. ఎందుకంటే ఇది కారు గుర్తును పోలి ఉండటమే కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రోటీమేకర్ గుర్తుపై పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ అనే అభ్యర్థికి రౌండ్ రౌండ్లోనూ ఓట్లు పెరుగుతున్నాయి.
మొదటి రౌండ్లో 122 ఓట్లు పోలవగా.. రెండో రౌండ్లో 158 ఓట్లు పోలయ్యాయి. కేవలం ఈ రెండు రౌండ్లలోనే 280 ఓట్లు రోటీ మేకర్ గుర్తుకే పడ్డాయి. మూడో రౌండ్లోనూ ఈ రోటీ మేకర్ గుర్తుకు 40 ఓట్లు పోలయ్యాయి. అలాగే వజ్రం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి కంటె సాయన్నకు కూడా మూడు రౌండ్లకు కలిపి 212 ఓట్లు పోలయ్యాయి.