Padi Kaushik Reddy | మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. ముందుగా తాను ఎలాంటి అవినీతి చేయలేదని పేర్కొంటూ తడి బట్టలతో దేవుడి ఫొటో ముందు పాడి కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. తాను ఎక్కడా ఒక్క అవినీతి చేయలేదని.. చేసే అవసరం కూడా తనకు లేదని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సవాలు విసిరారు.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు అపోలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తన నిజాయతీని నిరూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కౌశిక్ రెడ్డి సవాలు విసిరారు. ఫ్లైయాష్ తరలింపు, ఓవర్‌లోడ్ లారీల నుంచి డబ్బులు తీసుకోలేదని దేవుడి మీద ప్రమాణం చేయాలన్నారు. ఒకవేళ నువ్వు రాకపోతే అన్ని స్కామ్‌లు చేసినట్లు, అక్రమంగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నానని ఒప్పుకున్నట్లేనని స్పష్టం చేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఇటీవల కాంగ్రెస్ నేత ప్రణవ్‌బాబు స్పందించారు. కౌశిక్ రెడ్డి ఎలాంటి అవినీతి చేయకపోతే చెల్పూరు హనుమాన్ టెంపుల్‌కు వచ్చి ప్రమాణం చేయాలని సవాలు విసిరారు. ఈ సవాలును స్వీకరించిన కౌశిక్ రెడ్డి ఇవాళ చిల్పూరు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కౌశిక్ రెడ్డిని వీణవంకలోనే హౌస్ అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఈ క్రమంలో వీణవంకలోని తన ఇంట్లోనే కౌశిక్ రెడ్డి ప్రమాణం చేసి తన నిజాయితీ ని రుజువు చేసుకున్నారు.
తాను ఎలాంటి అవినీతి చేయలేదని తడి బట్టలతో ప్రమాణం చేసిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
సవాల్ స్వీకరించి చేల్పూర్ హనుమాన్ గుడి వద్దకు పోలీసులు వెళ్లకుండా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడంతో వీణవంక లోని తన ఇంట్లో తడిబట్టలతో తాను ఎలాంటి అవినీతి చేయలేదని, తడిబట్టలతో దేవుడి ఫొటోపై… https://t.co/yEvcpk9uFB pic.twitter.com/HgPYv3rHKv
— Telugu Scribe (@TeluguScribe) June 25, 2024
పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్టు
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలకు ఇటీవల కంగ్రెస్ నేత ప్రణవ్ కౌంటర్ ఇచ్చారు. చెల్పూరు హనుమాన్ టెంపుల్ దగ్గరకు రావాలని సవాలు విసిరారు. ఈ సవాలును పాడి కౌశిక్ రెడ్డి స్వీకరించారు.