ప్రజా సంబంధాలే పీఆర్సీఐ లక్ష్యం
మానవ సంబంధాలు రోజురోజుకూ దెబ్బతింటున్నాయని పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఆర్సీఐ) చైర్మన్ షకీల్ అహ్మద్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం సికింద్రాబాద్‌లో ‘ప్రజా సంబంధాలు - భవిష్యత్తు’ అంశంపై సెమినార్ నిర్వహించారు
- పీఆర్సీఐ చైర్మన్ షకీల్ అహ్మద్
- అవార్డు గ్రహీతలకు సన్మానం
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : మానవ సంబంధాలు రోజురోజుకూ దెబ్బతింటున్నాయని పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఆర్సీఐ) చైర్మన్ షకీల్ అహ్మద్ ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం సికింద్రాబాద్‌లో ‘ప్రజా సంబంధాలు – భవిష్యత్తు’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఇటీవలే దేశంలో అత్యుత్తమ చాప్టర్‌గా పైదరాబాద్కు గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను ఘనంగా సత్కరించారు. అనంతరం షకీల్ అహ్మద్ మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో హైదరాబాద్ చాప్టర్‌కు గుర్తింపు లభించడం సంతోషంగా ఉందన్నారు.
భవిష్యత్తులో యువ పీఆర్ నిపుణులకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. నేటి సమాజంలో ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఎంతో అవసరమని చెప్పా రు. దేశంలో అత్యుత్తమ చాప్టర్‌గా, జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రచార రూపకల్పన చాప్టర్‌గా హైదరాబాద్‌కు గుర్తింపు దక్కిందని, ఫెడ్రిక్ మైఖేల్, ప్రకాష్ జైన్, మిథాలి అగర్వాల్, సారా వరదానును అవార్డులు వరించాయని వివరించారు. కార్యక్రమంలో పీఆర్సీఐ జాతీయ ఉపాధ్యక్షుడు కే రవీంద్రన్, దక్షిణాది అధ్యక్షుడు టీవీఎస్ నారాయణ, వైస్ చైర్మన్ అనేజా, కార్యదర్శి ఫిలిప్ జాషువా, జాయింట్ సెక్రటరీ బీ జాకబ్ రాస్, కోశాధికారి నోయెల్ రాబిన్సన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

