Mancherial | మంచిర్యాల అర్బన్, జనవరి 24 : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో రుణాల పేరిట భారీ సాం జరిగింది. చనిపోయినవారి పేరిట రూ.6 కోట్ల వరకు రుణాలు స్వాహా చేసినట్టు శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని జన్మభూమినగర్‌లో గల ఓ ఫైనాన్స్ కంపెనీ వ్యక్తిగత, వాహన, ఇండ్లు, మార్టిగేజ్ రుణాలు ఇస్తున్నది. ఇందులో చెన్నూర్, పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన ఇద్దరు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.
వీరు జిల్లాలో చనిపోయిన వారి పేరిట ఆధార్ కార్డులు తయారు చేయించి, రుణాలు ఇప్పించారు. కొంతకాలం వాయిదాలు చెల్లించగా, రానురాను జాప్యం జరిగింది. అనుమానం వచ్చిన హెడ్ ఆఫీస్‌కు చెందినవారు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరుగుతున్నదని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్ తెలిపారు.