అయిజ: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యామ్‌కు వరద (Floods) ప్రవాహం పోటెత్తింది. భారీగా వరద నీరు జలాశయంలోకి చేరుతుండటంతో అధికారులు 12 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తివేశారు. ప్రాజెక్టులోకి 47,965 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 40,882 క్యూసెక్కుల నీరు కిందికి వెళ్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.