మహబూబ్నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయంలోకి లక్షా 2 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 1,15,584 వేల క్యూసెక్కు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలలో ప్రస్తుతం 8.611 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకుగాను ప్రస్తుతం 318 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది.