Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. స్థానికంగా ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్(Gomati Electronics)లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. రెండస్థుల ఈ భవనంలో మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం తీవ్రత చూస్తుంటే భారీగా ఆస్తి నష్టం సంభవించేలా ఉంది. అయితే.. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు పక్క దుకాణాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. మంటల దాటికి రిఫ్రిజేటర్స్లోని సిలిండర్స్ పేలిపోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు.