హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారికి భారీ విరాళాలు అందాయి. టీటీడీ బర్డ్ ట్రస్ట్‌కు హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ రూ.2.93 కోట్లు, ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1.10 కోట్లు విరాళంగా అందించాయి.
ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్యచౌదరికి ఆయా సంస్థల ఎండీలు వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీకుమారి డీడీలను అందజేశారు. నరసరావుపేటకు చెందిన రామాంజనేయుడు అన్నప్రసాదం ట్రస్ట్‌కు 10లక్షలు అందించారు.