బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 30 వేల మందికిపైగా భక్తులు మల్లన్నను దర్శించుకొన్నారు. భక్తులు స్వామి వారికి అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకొన్నారు. – చేర్యాల