స్టార్టప్‌లకు ‘వాటర్ చాలెంజ్’ పోటీ
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు సరైన మార్గాన్ని సూచించే స్టార్టప్‌లకు రూ.2.5 కోట్ల బహుమతి లభించనున్నది. నడ్గే ఫౌండేషన్, ఆశీర్వాద్ పైప్స్ ‘వాటర్ చాలెంజ్’ పేరుతో జాతీయస్థాయిలో ఈ పోటీని ప్రారంభించాయి. 18 నెలలు ఈ పోటీ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు ఇందులో భాగస్వామిగా ఉన్నారు. ఆసక్తి కలిగిన స్టార్టప్‌లు పరిష్కార మార్గాన్ని కనుగొని, దానిని పరీక్షించి, నెట్వర్క్ ఇన్వెస్టర్లు, మెంటార్స్, టెక్నాలజీ నాలెడ్జ్ పార్ట్నర్స్, పాలసీ సర్కిల్ అడ్వైజర్ల సాయంతో ఆ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. జలవనరులను గుర్తించటం, వాటిని కాపాడటం(రీచార్జ్), నీటిని శుద్ధిచేయటం, స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్, స్టోరేజీ, వృథానీటిని శుద్ధిచేయటం, అంతిమంగా ప్రజలకు తాగునీటి వసతిని పెంపొందించేందుకు ప్రణాళిక రచించాల్సి ఉంటుంది. మొదటిస్థానంలో నిలిచిన స్టార్టప్‌కు రూ.1.75 కోట్లు, మిగతా రూ.75 లక్షలు ఫైనలిస్టులకు పంచుతారు. ఉత్తమ ఆలోచనను కేంద్రం జల్ జీవన్ మిషన్‌లో వినియోగించే అవకాశం ఉంటుంది.