హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని జిల్లాల మత్స్యకార సొసైటీలకు ఎన్నికలు పూర్తికాకుండానే మత్స్యకార సొసైటీ రాష్ట్ర చైర్మన్‌ను ఎలా నియమించారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.సాయికుమార్‌ను రాష్ట్ర మత్స్య సొసైటీ చైర్మన్‌గా నియమించారంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ శుక్రవారం విచా రించగా, మళ్లీ 21కి వాయిదా వేశారు.