సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పీర్లచావిడి బజార్లో రోడ్డుపై ఉన్న రెండు దుకాణాలను మంగళవారం మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా దుకాణాదారులు, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. 40 ఏండ్ల నుంచి చేతివృత్తులు(రజక, మంగళి) చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇప్పుడు తమ దుకాణాలు తొలగిస్తే మేం బతికేదెట్లా? అని దుకాణాదారులు కుటుంబ సభ్యులతో కలిసివచ్చి ఆందోళన చేపట్టారు. తమ పైనుంచి వాహనాన్ని పోనిచ్చి ఆ తర్వాతే తమ ఇస్త్రీ దుకాణాన్ని కూల్చివేయాలని ఇందిరాల రాంబాబు అనే వ్యక్తి జేసీబీకి అడ్డుగా పడుకొని భీష్మించాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారితో చర్చలు జరిపి శాంతింపజేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏండ్ల క్రితం నిర్మించినా, అవి అక్రమమైతే తొలగించడం తప్పదన్నారు.