హైదరాబాద్ , జనవరి 28(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల హౌసింగ్ బోర్డు అవుట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజినీర్ దుర్గం శ్రీకాంత్‌ను ఉద్యోగంలో నుంచి తొలగించినట్టు కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపా రు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపా టు, భవిష్యత్తులో ఎకడా ఉద్యోగం రాకుండా వివరాల ను బ్లాక్ లిస్టులో పెడుతున్నట్టు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఉద్యోగులు, సిబ్బంది అవినీతికి పాల్బడితే, ప్రజలకు ఏమైనా ఫిర్యాదులుంటే 1800 599 5991 కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని కోరారు.
ఫొటోలు అప్లోడ్ చేయడం ఇలా..
లబ్ధిదారులు తమ మొబైల్ ఫోన్లో ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో తమ ఫోన్ నంబరుతో (ఓటీపీ ద్వారా) లబ్ధిదారుగా లాగిన్ కావాలి. డ్యాష్‌బోర్డులో వారికి సంబంధించిన వివరాలన్నీ కనిపిస్తాయి. ఇంటికి సంబంధించి ‘క్యాప్చర్ స్టేజ్ వైజ్ ఫొటో గ్రాఫ్స్’ అని ఇంటి నిర్మాణపు దశలు ఉంటాయి. అం దులో గ్రౌండింగ్, బేస్మెంట్, వాలింగ్, స్లాబు లెవల్, కంప్లీషన్ అని ఉంటాయి. వాటిలో ఏ దశ ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందో దానిపై క్లిక్‌చేసి, ఆ దశకు తగినట్టుగా నిర్దేశించిన వివరాలను పొందుపరుస్తూ, ఇంటి ఫొటోలను తీసి లబ్ధిదారులే స్వయంగా అప్లోడ్ చేయవచ్చు.