నార్నూర్, జనవరి 27 : ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.10 వేల లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లాలో హౌసింగ్ ఏఈ.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన ఓ లబ్ధిదారుడు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటునా ్నడు. పునాది పూర్తి చేసి, బిల్లు మంజూరు చేయాలని నార్నూర్ హౌసింగ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ (ఔట్ సోర్సింగ్) దుర్గం శ్రీకాంత్‌ను కోరగా ఆయన రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో లబ్ధిదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఏఈకి రూ.10 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈపై కేసు నమోదుచేసి కరీంనగర్ ప్రత్యేక కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.