బొల్లారం, ఫిబ్రవరి 5 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పథకాలు వెంటనే అమలు కావని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. న్యూబోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో బుధవారం శ్రీ గణేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ మహిళలు డబుల్ బెడ్రూంలు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని ఎమ్మెల్యేని ప్రశ్నించగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, ఇండ్లు ఇప్పుడే ఇవ్వలేమని జవాబిచ్చారు. మరీ ఎన్నికల సమయంలో ఎందుకు హామీలు ఇచ్చారని నిలదీశారు. దీంతో సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, బస్తీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.