Family Survey | రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సోమవారం నాటికి 65.02 శాతం పూర్తయింది. ఇప్పటి (సోమవారం) వరకూ1,16,14,349 నివాసాలలో సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, 75,75,647 నివాసాలలో పూర్తయింది. సర్వేలో అత్యదికంగా ములుగు జిల్లాలో 95.3 శాతం అంటే 97,552 ఇళ్లకు 92,928 ఇళ్లలో సర్వే పూర్తి చేసి మొదటి స్థానంలో ఉంది. నల్గొండ జిల్లా 89.1 శాతం అనగా 5,04,542 ఇళ్లకు 4,49,434 హౌస్ హోల్డ్స్ లలో సర్వే పూర్తి చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. జనగామ జిల్లాలో 86 శాతం అనగా 1,59,452 నివాసాలకు 1,37,069 హౌస్ హోల్డ్స్ లలో సర్వే పూర్తి చేసుకొని మూడో స్థానంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో మొత్తం 25,05,517 ఇళ్లకు 11,10,883 (44.3 శాతం) నివాసాలలో సర్వే పూర్తి చేసినట్లు రాష్ట్ర సమాచార, ప్రసారాలశాఖ స్పెషల్ కమిషనర్ తెలిపారు..