యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి(Bhuvanagiri )జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల హౌజ్ అరెస్టులు (House arrest)కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఇవాళ ధర్నాకు దిగుతారనే సమాచారంతో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేస్తున్నారు. నల్లగొండలో రామన్నపేటలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, బీబీనగర్‌లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అలాగే సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి, నాగారంలలో పలువురు బీఆర్ఎస్ నాయకులను హౌజ్ అరెస్టు చేశారు.
కాగా, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడికి నిరసనగా.. బీఆర్ఎస్ తలపెట్టిన మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులను భారీగా మోహరించారు. పలువురు నాయకులను ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భువనగిరిలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మరోవైపు తోపులాటలో కాలికి గాయం కావడంతో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డిని హాస్పిటల్‌కు తరలించారు.
నల్లగొండలో కంచర్ల భూపాల్ రెడ్డి హౌజ్ అరెస్టు..
రామన్నపేటలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగు లింగయ్య యాదవ్..
నాగారంలో..
దవాఖానలో చికిత్స పొందుతున్న రామకృష్ణారెడ్డి..