హైదరాబాద్, సెప్టెంబర్23(నమస్తే తెలంగాణ): సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన మెస్‌చార్జీలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని, తద్వారా విద్యార్థులకు పోషకాహారం అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కేవీపీఎస్(కులవివక్ష పోరాట సమితి)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సైలాబ్బాబు డిమాండ్ చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ సంక్షేమ భవన్ కార్యాలయం ఎదుట కేవీపీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టల్ విద్యార్థులు అనేక అరకొర వసతులతో, అదేవిధంగా పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సీఎం, మంత్రుల పిల్లలను ఇలా చదివిస్తారా? అంటూ నాడు ప్రతిపక్షనేతగా మాట్లాడిన నేటి సీఎం రేవంత్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని, వసతులను ఎందుకు మెరుగుపరచడం లేదని నిప్పులు చెరిగారు. విద్యార్థులకు ప్యాకెట్ మనీ రూ.2000 పెంచాలని, 173 హాస్టళ్లకు సంబంధించి అద్దెలు రూ.12కోట్లు బకాయి ఉందని, మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని అల్టిమేటం జారీ చేశారు. ధర్నాలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.