ఊట్కూర్ : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ( Tenth Class ) పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులను తపస్ ( Tapas ) సన్మానించింది. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలానికి చెందిన శిరీష ( Sirisha ) 560 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలువగా, బాలకృష్ణ ( Balakrishna ) 555 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచి ప్రతిభ చాటాడు.
వీరితో పాటు డీఎస్సీ 2024 లో ఉపాధ్యాయ ( Teachers )ఉద్యోగాలకు ఎంపికైన పెద్దజట్రం గ్రామ యువత తిమ్మప్ప, రేణమ్మను శనివారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు కృష్ణ ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహా , జిల్లా సమన్వయ కర్త నర్సింగప్ప హాజరై మాట్లాడారు.
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు సాధించడం ఎంతో సంతోషించదగిన విషయమని అన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల కృషితో ఉన్నతమైన ఫలితాలు సాధించారని కొనియాడారు.
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యసాధనకు కృషి చేయాలని సూచించారు. విద్యతోనే ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న విషయాన్ని మరచిపోకూడదని తెలిపారు. కార్యక్రమంలో తపస్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, జిల్లా మీడియా ఇన్చార్జి కిరణ్, సంఘం నాయకులు భాస్కర్, బాలప్ప, తిమ్మప్ప , రమేష్, రేణమ్మ, రేణుక, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.